ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్

ఇంటర్ వార్షిక పరీక్షలు 2027: ఇంటర్ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి 24 నుంచి నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి జరుగుతాయని బోర్డు అధికారులు తెలిపారు. ఈసారి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఇంటర్ పరీక్ష ఫీజు ఇప్పటివరకు 10 శాతం మంది విద్యార్థులు మాత్రమే చెల్లించారు. ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 9తో ముగియనుంది. ఆ తర్వాత ఈ నెల 21 వరకు.

ఇంటర్ వార్షిక పరీక్షలు 2027, NewzFast Telugu: ఇంటర్ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి 24 నుంచి నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి జరుగుతాయని బోర్డు అధికారులు తెలిపారు.

ఈసారి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇంటర్ పరీక్ష ఫీజు ఇప్పటివరకు 10 శాతం మంది విద్యార్థులు మాత్రమే చెల్లించారు. ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 9తో ముగియనుంది.

ఆ తర్వాత ఈ నెల 21 వరకు రూ. 100 రుసుముతో, ఈ నెల 30 వరకు రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 8 వరకు రూ.

వెయ్యి, డిసెంబర్ 15 వరకు రూ. 2 వేల ఆలస్య రుసుముతో చెల్లింపులకు అవకాశం ఉంది.

పరీక్షలకు కొత్త నామినల్ రోల్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ కోడ్స్, ప్రాక్టికల్ పరీక్షల కోడ్స్‌ను ఇంటర్ విద్యామండలి కేటాయించింది. సబ్జెక్టులవారీగా ఇంటర్నల్ అసెస్‌మెంట్ కోడ్స్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంటర్ అడ్మిషన్లకు ఈ నెల 13 వరకు అవకాశం కల్పించారు. ప్రైవేట్ కాలేజీల్లో రూ.

వెయ్యి ఆలస్య రుసుముతో అడ్మిషన్లు తీసుకోవచ్చు, ప్రభుత్వ కాలేజీల్లో ఆలస్య రుసుము ఉండదు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు