Telangana High Court food safety inspections Pullareddy Sweets, NewzFast Telugu (Hyderabad): ఎంపిక చేసుకుని కొన్ని ఆహార విక్రయ సంస్థలపైనే దాడులు చేయడంపై హైకోర్టు వైద్య-ఆరోగ్యశాఖ, ఆహార భద్రత అధికారులను ప్రశ్నించింది. ప్రజారోగ్యం దృష్ట్యా అన్ని వ్యాపార సంస్థలు ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించేలా చట్టాలు అమలు చేయాలని స్పష్టం చేసింది.
జి.పుల్లారెడ్డి స్వీట్స్ సనత్‌నగర్ తయారీ కేంద్రంలో తనిఖీల అనంతరం, సరైన ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొంటూ అధికారులు ఫుడ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. ఏకపక్షంగా సస్పెండ్ చేయడం చెల్లదని, లోపాలు సవరించుకున్నందున పునరుద్ధరించాలని సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
విచారణ సందర్భంగా అధికారులు బొద్దింకలు, ఇతర లోపాలు ఇంకా ఉన్నట్లు తెలపడంతో, లైసెన్స్ సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. అన్ని కేంద్రాల్లో తనిఖీలు చేపట్టాలని పేర్కొంటూ విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
మరోవైపు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు కొనాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేటు స్కూళ్లపై తీసుకున్న చర్యలను వివరించాలని సీబీఎస్‌ఈకి హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ ఈనెల 12న జరగనుంది.
