కమల్‌హాసన్ సండియార్ సినిమా టైటిల్, NewzFast Telugu: విలక్షణ నటుడు కమల్‌హాసన్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘సండియార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఎస్.యు.
అరుణ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
శుక్రవారం కమల్‌హాసన్ జన్మదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రకటనతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తుపాకీ చేతబట్టి, రక్తపు మరకలతో కారు వద్ద కమల్‌హాసన్ కనిపిస్తున్న తీరు కథాంశంపై ఆసక్తిని పెంచుతోంది.
పోస్టర్‌పై ఉన్న ‘రక్తంతోనే ప్రతీకారం తీరాలి’ అనే క్యాప్షన్ ఈ సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో సూచిస్తోంది. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.


