ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, NewzFast Telugu (రాయపోల్ మండలం, సిద్దిపేట జిల్లా): సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు తాము కష్టపడి పండించిన పంటలను దళారులకు విక్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని ఆమె సూచించారు. దీని ద్వారా గిట్టుబాటు ధర పొందవచ్చని తెలిపారు.
దళారుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని హెచ్చరించారు.
ఐకేపీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే వర్షాలు లేక రైతులకు పంట నష్టం జరిగిందని, కొనుగోలు కేంద్రం వద్ద తరలించే రైతులకు ఇబ్బందులు కలిగించవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియాల స్వామి, ఐకేపీ ఏపీఎం యాదగిరి, సీసీ నాగరాజు, వార్డు సభ్యులు కరుణాకర్, సునంద, నర్సింలు, నాయకులు తప్పెట సుధాకర్ మరియు రైతులు పాల్గొన్నారు.
