మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ ధరలు, NewzFast Telugu (హైదరాబాద్): దీపావళి కానుకగా మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను తెలంగాణ ప్రభుత్వం భారీగా తగ్గించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ప్రస్తుతం రూ.8,500గా ఉన్న నెలవారీ ఉమ్మడి పాస్ ధరను రూ.4,000కు తగ్గించారు. ఈ మొత్తంలో రూ.3,000 మెట్రో ప్రయాణానికి, రూ.1,000 ఆర్టీసీకి కేటాయించారు.
ఈ పాస్తో నెలలో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పులు ప్రయాణించవచ్చు.
రోజువారీ పాస్ ధర ప్రస్తుతం రూ.400గా ఉండగా, దానిని రూ.275కు తగ్గించారు. ఇందులో రూ.200 మెట్రోకు, రూ.75 ఆర్టీసీకి చెందుతాయి.
ఈ పాస్తో రోజుకు నాలుగు సింగిల్ జర్నీలు చేసే అవకాశం ఉంటుంది.
ఈ సవరించిన కొత్త ధరలు నవంబర్ 8 నుంచి అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మెట్రో, ఆర్టీసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
హైదరాబాద్లో రోజూ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుంది.
