Telangana sports hub development Sridhar Babu badminton, NewzFast Telugu (Gachibowli, Hyderabad): రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర మంత్రి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
తెలంగాణను అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఈ నెల 3 నుంచి 8 వరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ‘తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్-2026’ టోర్నమెంట్ జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్, పుల్లెల గోపీచంద్‌తో కలిసి వెబ్ల్యాబ్స్ అభివృద్ధి చేసిన స్పోర్ట్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.
