బ్లడీ రోమియో నాని సినిమా షూటింగ్, NewzFast Telugu: అగ్ర కథానాయకుడు నాని ‘ది ప్యారడైజ్’ తర్వాత విరామం తీసుకుంటారని అంతా భావించారు. అయితే ఆయన వెంటనే విభిన్నమైన లుక్‌తో ‘బ్లడీ రోమియో’ షూటింగ్లో పాల్గొన్నారు.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఇటీవల ఢిల్లీలో మొదలైంది. ఇంతలోనే తొలి షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం.
రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ఉంటుందని తెలిసింది.
లండన్ నేపథ్యంలో ఫుడ్ మాఫియా చుట్టూ సాగే స్టైలిష్ డార్క్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇదని చెబుతున్నారు. ఇందులో నైపుణ్యం కలిగిన చెఫ్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా నాని రెండు షేడ్స్‌లో కనిపిస్తారట.
ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వినికిడి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

