ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలు, రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల ఇండ్లలో కార్యక్రమం

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి: దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను సమావేశానంతరం మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన వెల్లడించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2.25 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ఆయన చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 9న కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ రైతు బహిరంగ సభ ఉంటుందని మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి, NewzFast Telugu (తెలంగాణ): దీపావళి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలను సమావేశానంతరం మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన వెల్లడించారు.

ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2.25 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ఆయన చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో లబ్ధిదారులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు.

నవంబర్ 9న కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ రైతు బహిరంగ సభ ఉంటుందని మంత్రి తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించిందని చెప్పారు.

అదే రోజున ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని, రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని సిద్దిపేటలో ప్రారంభించనున్నట్టు ఆయన వెల్లడించారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు