ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ రాజేశ్ బిందాల్ నియామకం, NewzFast Telugu: నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ నియమితులయ్యారు.
ఆయన ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టు నుంచి ఉద్యోగ విరమణ పొందారు. ఈ ఏడాది జూలై 1న ఎన్సీఎల్ఏటీ చైర్‌పర్సన్‌గా పదవీకాలం ముగిసిన జస్టిస్ అశోక్ భూషణ్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
జస్టిస్ బిందాల్ సుప్రీంకోర్టులో మూడేండ్లకు పైగా న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 15న ఆయన ఉద్యోగ విరమణ చేశారు.
అంతకు ముందు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.
హర్యానాలోని అంబాలాలో 1961 ఏప్రిల్ 16న జన్మించిన జస్టిస్ బిందాల్, 1985 సెప్టెంబర్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. జమ్ము, కశ్మీర్ హైకోర్టు, కలకత్తా హైకోర్టుల్లోనూ ఆయన పనిచేశారు.
ఎన్సీఎల్ఏటీ, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నిర్ణయాల నుంచి ఉత్పన్నమయ్యే సవాళ్లను విచారించే ప్రధాన అప్పీలేట్ వేదికగా పనిచేస్తుంది. దివాలా, రుణ పరిష్కార చట్టం, 2016, పోటీ చట్టం, 2002 కింద ఉన్న విషయాల్లోనూ దీనికి అప్పీలేట్ అధికార పరిధి ఉంది.
దేశ కార్పొరేట్ వివాద పరిష్కార వ్యవస్థల్లో, ముఖ్యంగా దివాలా ప్రక్రియలు, కార్పొరేట్ పునర్నిర్మాణం, విలీనాలు, పోటీ చట్టానికి సంబంధించిన విషయాల్లో ఈ ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుంది.

