మారుతి సుజుకీ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్లు తెలంగాణ, NewzFast Telugu (న్యూఢిల్లీ): కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ తెలంగాణ వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో 12 ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
ఇందుకోసం తెలంగాణ రవాణా శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రజలకు డ్రైవింగ్ పరీక్షల నిర్వహణలో కొత్త సౌకర్యాన్ని అందించనుంది.
రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, కొండాపూర్ వద్ద ఈ టెస్టింగ్ ట్రాక్లు ఏర్పాటు కానున్నాయి. మేడ్చల్ జిల్లాలో ఉప్పల్, మేడ్చల్, నాగోల్ ప్రాంతాలతో పాటు కరీంనగర్ జిల్లాలోనూ ఈ సదుపాయాలు రానున్నాయి.
కేంద్ర మోటారు వాహన నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా కంప్యూటరైజ్డ్, నియమ ఆధారిత పరీక్షలు నిర్వహించేలా ఈ ట్రాక్లను రూపొందిస్తున్నారు. ఇందులో హై-డెఫినిషన్ కెమెరాలు, ఆర్ఎఫ్ఐడీ సెన్సార్లు, రియల్-టైమ్ అనలిటిక్స్, ఒక సమీకృత ఐటీ వ్యవస్థ ఉంటాయని మారుతి సుజుకీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

