TGTET ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మాక్ టెస్ట్ ప్రాక్టీసుకు అవకాశం, NewzFast Telugu (మహబూబ్‌నగర్): TGTET In-Service Teachers 2026-II పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల కోసం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంపై మాక్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఈ మాక్ టెస్ట్ 2026 నవంబర్ 5 నుంచి 10 వరకు జరగనుంది. ఇందుకోసం జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ZPHS భూత్పూర్, ZPHS జడ్చర్ల, ZPHS (Girls) దేవరకద్ర, ప్రభుత్వ హైస్కూల్ షాషాబ్ గుట్ట, KGBV మహబూబ్‌నగర్ అర్బన్ కేంద్రాల్లో ఏదైనా ఒకదాన్ని సందర్శించి మాక్ టెస్ట్ రాయవచ్చు. మాక్ టెస్ట్ schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంపై అవగాహన పొందేందుకు, కంప్యూటర్ వినియోగంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులందరూ దీనిని వినియోగించుకోవాలని సూచించారు.
గమనిక: ఈ మాక్ టెస్ట్‌కు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD (Official Duty) సౌకర్యం కల్పించబడదు. ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత సౌలభ్యం మేరకు హాజరుకావాలి.
కేటాయించిన కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చు.

