జిల్లాస్థాయి యువజనోత్సవం బహుమతుల ప్రదానోత్సవం హనుమకొండ, NewzFast Telugu (హనుమకొండ): యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలు, సాంస్కృతిక ప్రతిభను వెలికితీయడానికి యువజనోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా యువజన క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ అన్నారు.
హనుమకొండ జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లాస్థాయి యువజనోత్సవ బహుమతుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కొత్త ప్రశాంత్ వివిధ పోటీల విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
కవితా రచన పోటీలో జి. ఆకాంక్ష ప్రథమ బహుమతి, ఎన్.
వైష్ణవి ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. చిత్రలేఖన పోటీలో పి.
శ్రీనిక ప్రథమ, డి. వాహిని ద్వితీయ బహుమతి సాధించారు.
నుక్కడ్ నాటక్ పోటీలో కౌశల్ బృందం విజేతగా నిలిచింది. జానపద గీతాల బృంద పోటీలో ఎస్.కె.
ఖైరాన్ ప్రథమ, కావేరి ద్వితీయ స్థానం పొందారు.
జానపద బృంద నృత్య పోటీలో సిరి పౌర్ణమి బృందం ప్రథమ, పరశురామ్ బృందం ద్వితీయ బహుమతి గెలుచుకుంది. కార్యక్రమంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు కూడా పాల్గొన్నారు.
విద్యతో పాటు కళలు, క్రీడలు, సామాజిక సేవ, నాయకత్వ లక్షణాలలోనూ యువత ముందుండాలని వక్తలు పిలుపునిచ్చారు. విజేతలందరికీ అధికారులు, జాతీయ యువజన అవార్డు గ్రహీతలు అభినందనలు తెలిపారు.
