ఏపీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, NewzFast Telugu: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత క్యూలైన్‌లో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయి.
అయితే నాలుగు జిల్లాల్లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కడప, పులివెందుల నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
టీడీపీ, వైసీపీ కార్యకర్తలు దాడులు చేసుకున్నట్లు నివేదికలు ఉన్నాయి.
పోలింగ్ తీరుపై రెండు వర్గాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. పరిశీలన అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
శనివారం ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు.
