సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకుల కీలక పాత్ర: టీటీడీ జేఈవో

TTD priest training programme concluding ceremony Tirupati: సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులు కీలక పాత్ర పోషిస్తున్నారని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ పేర్కొన్నారు. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 5 వరకు 15 రోజులపాటు నిర్వహించిన అర్చక శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశం తిరుపతిలో జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న అర్చకులకు ధార్మిక గ్రంథాలు, పూజా సామగ్రి, ప్రశంసా పత్రాలు అందజేశారు.

TTD priest training programme concluding ceremony Tirupati, NewzFast Telugu (Tirupati): సనాతన ధర్మ పరిరక్షణలో అర్చకులు కీలక పాత్ర పోషిస్తూ, భక్తికి, సంప్రదాయానికి, దేవాలయానికి, సమాజానికి మధ్య ఆధ్యాత్మిక వారధులుగా నిలుస్తున్నారని టీటీడీ జేఈవో డా. ఎ.

శరత్ పేర్కొన్నారు.

టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 5 వరకు 15 రోజులపాటు నిర్వహించిన అర్చక శిక్షణ కార్యక్రమ ముగింపు సమావేశం గురువారం తిరుపతిలోని శ్వేత భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ సమాజంలో అర్చకులకు విశిష్టమైన గౌరవప్రదమైన స్థానం ఉందన్నారు.

అర్చకత్వం కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తరతరాలకు ధర్మ సంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను అందించే పవిత్రమైన సేవ అని ఆయన తెలిపారు. క్రమశిక్షణ, నిష్ఠ, భక్తి, సంప్రదాయాల పట్ల సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలని కోరారు.

భగవంతుని సన్నిధిలో అన్ని వర్గాలకూ సమాన ప్రాధాన్యత ఉందని, అన్ని సామాజిక వర్గాల వారు అర్చకత్వాన్ని స్వీకరించి సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఒక అర్చకుడు తయారైతే ఒక తరానికి ధర్మ సేవకుడు అందించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

శిక్షణ పూర్తి చేసుకున్న అర్చకులకు శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాలు, ఇత్తడి పళ్లెం, గంట, హారతి పాత్ర, పలక, రెండు రాగి గ్లాసులు, ఉద్ధరిణి, ప్రశంసా పత్రాలు అందజేశారు. సకల దేవతా కల్యాణ ప్రయోగం, టీటీడీ పంచాంగం, ఆలయ అర్చన, ఆరాధన విధానం తదితర ధార్మిక గ్రంథాలను కూడా అందించారు.

ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు తాళ్లూరి విష్ణు, జోనల్ ఇన్‌చార్జి రెడ్డెప్ప రావు, శ్వేత డైరెక్టర్ డాక్టర్ వేమా వేంకటరత్నం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

ముఖేష్ గుసాయిన్

ముఖేష్ గుసాయనా 6 సంవత్సరాల జర్నలిజం అనుభవం కలిగిన డిజిటల్ న్యూస్ ఎడిటర్. JCD విద్యాపీఠ్, సిర్సా నుంచి BMC పూర్తి చేశారు. NewzFastTelugu.com ద్వారా విశ్వసనీయమైన వార్తలు మరియు ఉపయోగకరమైన సమాచారాన్ని పాఠకులకు అందించడంపై దృష్టి సారిస్తున్నారు.

Website

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

క్రీడలు

వార్తా విభాగాలు